ఘనంగా పోచమ్మ బోనాల పండుగ

తెలంగాణ ప్రభ (కోరుట్ల):కోరుట్ల మండలంలోని యూసఫ్ నగర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు పండగ కార్యక్రమం జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా గంగ పుత్రుల గొల్లెనులతో ద్యావతి రాజులు  పోతరాజుల విన్యాసాలతో, డప్పు చప్పులతో ఊరేగింపుగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వెళ్లి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పోచమ్మ తల్లికి మేక పిల్లలతో గ్రామస్తులు మొక్కలు చెల్లించుకున్నారు. 

ఈ కార్యక్రమానికి గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దమనుషులు, సభ్యులు హాజరైనారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిల్ల సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు ముక్కెర లింబాధ్రి, vdc ఛైర్మన్ వెల్లుల శ్రీనివాస్, క్యాషియర్ గుగ్గిల్ల శ్రీనివాస్, రాకేష్, రాజేందర్, సత్యనారాయణ, రాజం, మరియు అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు

.