తెలంగాణ ప్రభ (కోరుట్ల): పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 1973-75 ఇంటర్మీడియట్ బ్యాచ్ కు చెందిన అప్పటి పూర్వపు విద్యార్థులు ప్రస్తుతం వివిధ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వారు ఒకచోటకు చేరుకొని ఆత్మీయ కలయిక చేసుకున్నారు.
50 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ చదువుకున్న అప్పటి విద్యార్థులు, ప్రస్తుత సీనియర్ సిటిజన్స్ గా మారారు .
అయినా వారు ఒకరికొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సరదాగా గడిపారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందం పొందారు .మృతి చెందిన పలువురికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి నారాయణరెడ్డి, బర్ల సాయన్న, ఉయ్యాల నరసయ్య, శ్యాముల్ నాయక్, పుప్పాల ప్రభాకర్,వనతడుపుల మురళి, విశ్వనాథం, అశోక్, మేడి కిషన్, కృష్ణమూర్తి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
.