తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణ కాంగ్రెస్ కు గుండెకాయ లాంటి నాయకుడు తిరుమల గంగాధర్ - కాంగ్రెస్ శ్రేణులు
కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ప్రధాన అనుచరులు,
కోరుట్ల పట్టణ భావి రథసారథి, కోరుట్లగడ్డ ముద్దుబిడ్డ, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పుట్టినరోజు సందర్భంగా కోరుట్ల జువ్వాడి భవన్ లో జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,శాలువతో సత్కరించి వేడుకలు నిర్వహించడం జరిగింది.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం రాజం,ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ కవిత, ఆధ్వర్యంలో తిరుమల గంగాధర్ స్థానిక వార్డు అయినటువంటి 13 వ వార్డులో కాంగ్రెస్ శ్రేణులు, తిరుమల గంగాధర్ అభిమానులు కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ తిరుమల గంగాధర్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులను, శ్రేణులను కలుపుకుని,పార్టీ జాతీయ అధిష్టానం,రాష్ట్ర అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను మరియు స్థానిక జువ్వాడి బ్రదర్స్ ఆదేశానుసారం పార్టీ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే వారని, వార్డు ప్రజలను కంటికి రెప్పల కాపాడుకునే గొప్ప నాయకులు అని పేర్కొన్నారు..
నాడు వందపడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నా పనులు మొదలు పెట్టక పోవడంతో, పేద ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి రావాలనే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం ఆసుపత్రి పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆసుపత్రి ఆవరణలో వినూత్న రీతిలో అరగుండు కొట్టించుకుని చేసిన నిరసన కార్యక్రమం మరియు జువ్వాడి సోదరులు చేసిన శిలాఫలకం పిండ ప్రధానం నిరసన కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అని కాంగ్రెస్ శ్రేణులు అన్నారు..
ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
.