తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని కల్లూరు గ్రామంలో ఏఎన్ఎంలు శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని వారం రోజులకొకసారి మార్చాలన్నారు. ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో వుంచకుండా చూడాలని సూచించారు. తద్వారా కలిగే అనర్ధాలు, మలేరియా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
