కోరుట్లలో జమ్మి గద్దే వద్ద గుడిసె వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి పట్టాలు ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల  RDO కు సిపిఎం  జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జమ్మి గద్దె వద్ద గుడిసే వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి, పట్టాలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ కోరుట్ల పట్టణం సంగేం రోడ్డు జమ్మిగడ్డ వద్ద గల సర్వేనెంబర్ 923 లోని 52 ఎకరాల ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చి పట్టా ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా రూ/-10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని, 2024 ఫిబ్రవరి 16వ తేదీ తెల్లారి జామున 3గంటలకు పూలే అంబేద్కర్ నగర్ లో పోలీసులు, రెవిన్యూ సిబ్బంది పేదలు వేసుకున్న గుడిసెలు పక్కా గృహాలను దౌర్జన్యంగా బుల్లోజర్లు, ట్రాక్టర్లు, ఒక ప్రోక్లైనర్లతో కూల్చి వేసిన దానిలో జరిగిన నష్టపరిహారాన్ని పేదలకు అందించాలని, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.                         ఈ సందర్భంగా కోరుట్ల  ఆర్డీవో ఆనంద్ కుమార్ కు సిపిఎం జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్ నాయకత్వంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది, 

ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ రజియా సుల్తానా, నాయకులు కుంచెం శంకర్, కడకుంట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

.