బొగ్గు గనులను సింగరేణికి కేటాయించకుండా చేస్తే ఊరుకునేదే లేదు
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను కేటాయించకుండా వేలం ద్వారా ప్రవేట్ పరం చేసే కుట్రలో భాగంగా నిరసిస్తూ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట చాకలి ఐలమ్మ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి బిజెపి పార్టీ రాగానే టోల్ ప్లాజా ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది గురి చేయడమే కాకుండా బొగ్గు గనులను ప్రైవేటు వారికి దగ్గర వేలం వేయడం సింగరేణి దక్కకుండా చేయడం అన్యాయమని అన్నారు. సింగరేణి బొగ్గు గనులు రాకపోతే రాబోయే పది సంవత్సరాలలో సింగరేణి కనుమరుగయ్య ప్రమాదం ఉందని అలా జరిగితే బొగ్గు గనులు ప్రైవేటుపరమై విద్యుత్ పై భారం పడుతుందని అలాంటప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని అలాంటి నిర్ణయాలు ఏమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ప్రజలందరికీ న్యాయం జరిగేలా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్, ఏఐటీయూసీ అధ్యక్షులు శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షులు రాములు, సిపిఐ నాయకులు సహదేవ్, ఇమామ్, బాబు, నరసింహారెడ్డి, రవి, వెంకటేష్, సామేలు, ఆశయ, యాదగిరి, యాకయ్య, లక్ష్మణ్, యాగంటి, తదితరులు పాల్గొన్నారు.
