తెలంగాణ ప్రభ (కోరుట్ల): తేదీ 5-6-2024 శుక్రవారం రోజున మెట్ పల్లి ప్రెస్ క్లబ్ (వర్కింగ్ జర్నలిస్ట్) నూతన కార్యవర్గ సమావేశం స్థానిక ఆర్బీ రెస్టారెంట్ లోని సమావేశ హాలులో సీనియర్ పాత్రికేయులు సౌడాల కమలాకర్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు ఈ సమావేశoలో పాల్గొన్నారు.
అనంతరం ప్రెస్ క్లబ్ కో -ఆర్డినేషన్ చెర్మన్ గా సౌడాల కమలాకర్ , న్యాయ సలహాదారుగా అలాల శంకర్ ను ఎన్నుకోవడం జరిగింది...
సౌడాల కమలాకర్ కో - ఆర్డినేషన్ కమిటీ చెర్మన్,
అలాల శoకర్ (నమస్తే తెలంగాణ ఆర్ సి ఇంచార్జ్ )న్యాయ సలహాదారులు ,
కోరుకంటి విజయ్ కుమార్ (NTV రిపోర్టర్ ) సహా కో - ఆర్డినెటర్ ,
మన్నెని వేణు రావ్( అంధ్రజ్యోతి టౌన్ ) సహా కో - ఆర్డినేటర్ ,
ఏనుగందుల గోపి గౌడ్( టీ న్యూస్ ) ముఖ్య సలహదారులు,
మహమ్మద్ షౌకత్ (వెలుగు టౌన్)ముఖ్యసలహదారులు,
ముదాం శ్రీనివాస్( ZEE తెలుగు)కోశాధికారి
అనుపురం సతీష్ (BIG TV) ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఎన్నుకోవడం జరిగింది . అనంతరం కో ఆర్డినేషన్ చైర్మన్ సౌడాల కమలాకర్ గారిని సీనియర్ పాత్రకేయ మిత్రులు అలాల శంకర్ మరియు క్లబ్ సభ్యులు శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్బంగా సౌడాల కమలాకర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఈ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశామని, ఈ ప్రెస్ క్లబ్ లో ఉన్న సభ్యులు కేవలం వర్కింగ్ జర్నలిస్ట్ లు మాత్రమే ఉంటారని ఆయన తెలిపారు.
ఈ ప్రెస్ క్లబ్ ముఖ్య ఉద్దేశం సొంత ప్రయోజనాలకు కాకుండా సమాజoలో జరిగే ఆవినితి పై నిజాలను నిర్భయంగా బయట పెట్టె ప్రతి ఒక్క విలేకరికి అండగా ఉంటుందని తెలిపారు.
.