కోరుట్లలో స్వామి వివేకానంద వర్ధంతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కుందారపు మహేందర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ, విదేశాల్లో ఎన్నో సభలలో పాల్గొని మన హిందూ ధర్మం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియచేశారని, అలాగే యువతే దేశానికి వెన్నెముక అని చెప్పడం జరిగిందని, ఈ సందర్భంగా ఆయన ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీ గద్దె నరేంద్ర కోశాధికారి కొమ్ముల జగపతిరెడ్డి, రీజియన్ చైర్మన్ పోతని ప్రవీణ్, జోన్ చైర్మన్ ఆడెపు కమల, మరియు క్లబ్ జిల్లా నాయకులు గుంటుక చంద్ర ప్రకాష్ ,ఆడెపు మధు, వనపర్తి చంద్రమోహన్ ,చౌకీ రమేష్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ ,మార్గం నరేష్, గోనెమురళి తదితరులు పాల్గొన్నారు.

.