తెలంగాణ ప్రభ (జగిత్యాల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన మోతుకూరు నవ్య చాలా నిరుపేద కుటుంబానికి చెందిన యువతి నవ్యకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది ఇట్టి విషయం తెలుసుకున్న కోరుట్ల కోటినవదుర్గ మహిళా లయన్స్ క్లబ్ సభ్యులు రూపాయలు 11500/- చికిత్స కొరకై ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో మహిళ క్లబ్ అధ్యక్షురాలు పోతని శ్రీలత, సెక్రెటరీ పోలాస గీత, జోన్ చైర్మన్ ఆడేపు కమల, కౌన్సిలర్ రుద్ర సుజాత, మాజీ అధ్యక్షురాలు వనపర్తి రమ్య, వైస్ ప్రెసిడెంట్ కుందారపు ప్రేమలత పాల్గొన్నారు.
