తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో మాజీ మంత్రి వర్యులు శ్రీ జూవ్వాడి రత్నాకర్ రావు తనయుడు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అక్కడక్కడా అభిమానులు, కార్యకర్తలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి,కేకు కట్ చేశారు.మరియు కొన్ని ప్రాంతాలలో సామాజిక కార్యక్రమాలు బ్లడ్ డోనేషన్ క్యాంప్, అన్నదాన, మరియు స్కూలు పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు,అభిమానులు మాట్లాడుతూ నర్సింగరావు మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని ఆయురారోగ్యాలతో ఉండి, భవిష్యత్ లో వారు ఉన్నత పదవులుచేపట్టాలని ఆకాక్షించారు.
.