ఫుడ్ రెస్టారెంట్ బేకరీలలో కల్తీ కల్తీ కల్తీ పానీ పూరిలో భయంకరమైన రసాయనాల గుర్తింపు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తినే పానీ పూరి లో భయంకరమైన రసాయనాలు ఉన్నట్లు ఇతర రాష్ట్రాలలో సంబంధిత అధికారులు నిర్వహించిన  నివేదికలో వెళ్లడైంది.

చిన్న పిల్లలు పెద్దలు కలిసి బయటకు వెళ్లి ఆహారం తిందాం అనగానే రెస్టారెంట్లు బేకరీలు ఐస్ క్రీమ్ పార్లర్లో ఎలాంటి శుచి శుభ్రత ఉందా లేదా అనే కనీస విషయాలు పట్టించుకోకుండా ఇట్టి ఆహార పదార్థాలు ఏ రకంగా తయారు చేస్తున్నారు తెలుసుకోకుండా పిల్లల కోరిక మేరకు కల్తీ అనే భయంకరమైన రసాయనాలను సేవించి అనారోగ్య బారిన పడుతున్నారు. 

ముఖ్యంగా చిన్నపిల్లలు ఇష్టంగా తినడానికి భయంకరమైన కెమికల్స్ రంగుల రూపంలో వాటిలో కలిపి పిల్లలు నిత్యం ఇంట్లో ఆహార పదార్థాలు మాని బయట ఏమాత్రం శుచి శుభ్రంగా లేని పానీ పూరీ బండ్ల వద్ద బారులుతీరుతుంటారు. కొన్ని ఏళ్లుగా పిల్లలతో పాటు పెద్దలు కూడా పానీ పూరీ తెగ లాగించేస్తున్నారు. 

ఈ పానీ పూరీ ఎలా తయారు చేస్తారు ఇందులో ఏమేమి కలుపుతారు దీనిని తయారు చేసే విధానం ఎంత దారుణంగా ఉంటుందో ఎప్పుడైనా ఎవరైనా గమనించారా. పిల్లలు తినే ప్రతి ఆహార పదార్థం ఎంతగానో వారికి నచ్చేలా కలర్లతో తయారుచేసి వారికి నచ్చే విధమైన మసాలాలతో స్వీట్లతో తయారుచేసి వారు సొమ్ము చేసుకోవడానికి మాత్రమే పిల్లల ఆరోగ్యం,  ప్రాణాలు ఏమాత్రం పట్టించుకోకుండా పట్టణాలలో అనేక భయంకరమైన రసాయనాలచే కల్తీ ఆహారాలు తయారుచేసి సొమ్ము చేసుకున్న పట్టించుకుని నాథుడే కరువయ్యారు. 

ఏవైనా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు తూ.తూ. మంత్రంగా తనిఖీలు నిర్వహించి నామమాత్రపు జరిమానాలు విధించడంతో, ఇలాంటి కల్తీ ఆహారం తయారు చేసే వారిలో ఎలాంటి మార్పు రాదనడంలో సందేహం లేదు. 

పట్టణాలలో అనేక రెస్టారెంట్లు ఐస్ క్రీమ్ పార్లర్లు బేకరీలు, చిన్న పిల్లల కోసం తయారు చేసే స్వీట్స్, కారపు తిను బండారాలు ఏ మాత్రం శుభ్రత శుచి లేకుండా ఏమాత్రం క్వాలిటీ లేకుండా మరిగిన నూనెలతో విషపు కలర్ రసాయనాలతో తయారుచేసి గ్రామాలలో పట్టణాలలో కిరాణా షాపులలో విక్రయిస్తుంటారు. 

వీటిపై సంబంధిత అధికారులకు ఎలాంటి అవగాహన ఉండదు. ప్రత్యేక పట్టింపు అసలే ఉండదు. తద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లలో చిన్నచిన్న దుకాణాలలో ఇలాంటి చిరు పదార్థాలు తయారుచేసి నిత్యం వేలల్లో దండుకుంటూ చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.  జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయి లో  దృష్టి సారించకపోవడం, తద్వారా చిన్నారులకు సరియైన పోషణ ఆహారం దొరక్క పోగా కల్తీ ఆహారం తో వారి బంగారు బాల్యం అసంపూర్తిగా అనారోగ్యంగా తయారై అనేక రకాల రుగ్మతలకు గురై హాస్పిటల్స్ లలో లక్షలు వెచ్చిస్తున్న గాని వారి ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించదని వైద్యులు సూచిస్తున్నారు. 

ఇలాంటి చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బేకరీలు, రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ పార్లర్,లో పానీపూరి బండిల పై ప్రభుత్వం నాయకులు జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఎలాంటి వాటిని కొనసాగించాలి, ఎలాంటి వాటిని మూసివేయాలి అనే పూర్తి ప్రణాళిక రూపొందించి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాలలో పానీపూరి బండ్లపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా భయంకరమైన నిజాలు వెల్లడైన విషయం తెలిసిందే. మన రాష్ట్రాల్లో కూడా అలాంటి రసాయనిక పదార్థాలు ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా నిరంతరం పట్టణాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో అన్ని గ్రామాల పట్టణాలతో పాటు చిన్న పిల్లలు తినే అనేక ఆహార పదార్థాలు కల్తీ కి గురవుతున్నాయా లేదా వీటిని తయారు చేయడంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు వీటికి అధికారికంగా గుర్తింపు ఉందా అనే అంశాలను పరిశీలించి పిల్లల ఉజ్వల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు.

.