కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి  జువ్వాడి నర్సింగరావు  పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం నిర్వహించిన కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి రిజ్వాన్ పాషా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ప్రియతమ నాయకుడు జువ్వాడి నర్సింగరావు జన్మదినం పురస్కరించుకుని కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి రిజ్వాన్ పాషా ఆధ్వర్యంలో పట్టణంలోని నిరుపేదలకు,యాచకులకు అన్నదానం నిర్వహించడం జరిగింది.. 

అభిమాన నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన యువ నాయకుడు ఎండి రిజ్వాన్ పాషా ను పలువురు అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కౌన్సిలర్, యం ఏ నయీం,నాగభూషణం, కోరుట్ల మండల అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి , కోరుట్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, ఏంబేరి సత్యనారాయణ, వెంకటేష్, కాశిరెడ్డి, ముల్క ప్రసాద్,  పోతుగంటి శంకర్ గౌడ్, ముహమ్మద్ ముజ్జు,గణేష్, గంగాధర్, సృజన్,  లక్ష్మి నారాయణ, అమరేందర్, భూమయ్య, దివాకర్,  గణేష్, విజయ్, ఎడ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

.