తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల ప్రజా పరిషత్ ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. కోటగిరి మండలానికి ప్రత్యేక అధికారిక బోధన్ డివిజన్ పంచాయతీ అధికారి సాయిబాబాను గురువారం నియమించి, మండల పరిషత్ కార్యాలయ బాధ్యతలను స్వీకరించడం జరిగిందని మండల అభివృద్ధి అధికారి కె.ఆర్. మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక అధికారికి కార్యాలయ సిబ్బంది పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ విట్టల్, ఏపీవో రమణ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
