రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

తెలంగాణ ప్రభ (కోటగిరి): రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు కోటగిరి మండల కేంద్రంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు వేముల నవీన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వేముల నవీన్ తెలిపారు. రాహుల్ గాంధీ వెంటనే హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ,లేదంటే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు మామిడి శ్రీనివాస్ కమ్మరి వేణు మామిడి రవి ఆకుల నరేష్ చాకలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

.