తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) సూరారం కాలనీ,రాజీవ్ గృహకల్ప లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సురేష్ రెడ్డి.
అలాగే చికత్స కు వెళ్లిన వారికి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారా, టాబ్లెట్ లు, వైద్య పరీక్షలు సరిగా చేస్తున్నారా అని అడిగి తెలుసు కున్నారు.
డాక్టర్లు చేస్తున్న కృషి సేవ చాలా గొప్పది, దేవుని తర్వాత నమ్మేది ఒక డాక్టర్ ను మాత్రమే అని సురేష్ అన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందిచలానే ఉద్యేశం తో బస్తీ దవఖానలను కూడా గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, రాజీవ్ గృహ కల్ప అధ్యక్షులు శివాజీ, వెంకట్ రెడ్డి, కృష్ణ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
.