కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళ్ళు అరిపించిన కురుమ సంఘం నాయకులు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కురుమ సంఘం కమిటీ సభ్యులు. జగద్గిరిగుట్ట డివిజన్ లో ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ కురుమ సంఘం అధ్యక్షులు పాల కృష్ణ, సెక్రటరీ కుంటి మల్లేష్, ప్రతాప్, దుర్గయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల కృష్ణ, కుంటి మల్లేష్ మాట్లాడుతూ నిజాం రాజుల దుష్పరిపాలన నుండి ప్రజలను రక్షించి నిజాములకు తొత్తులుగా మారి దొరలు దోపిడి చేస్తూ, దొరలు ప్రైవేట్ సైన్యమైన రజాకార్ల కామం, రక్తదాహం నుంచి ప్రజల విముక్తి కోసం రాజీలేని పోరాటం చేసి ప్రాణాల్పరించిన దొడ్డి కొమురయ్య త్యాగధనులను మరిచిపోతే చరిత్ర క్షమించదని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన, దొడ్డి కొమురయ్యను అమెరికాలోని చరిత్రకారులు కూడా కొనియాడుతుంటే, మన ఛాతీ గర్వంతో ఉప్పొంగిపోతుందని గర్వించారు. కడవెండి, పాలకుర్తి, దేవరుప్పుల, వీర భైరాన్ పల్లి, కూటిగల్లు, నర్మెట, ధర్మపురం తండా, మొండ్రాయి, కొలుకొండ, పరకాల, ఖిలా వరంగల్ వంటి వేల గ్రామాల నేల.. వీరుల రక్తంతో తడిసి అంగుళం అంగుళం పునీతమైందని, తెలంగాణ రైతుల పోరాట పటిమను వెయ్యి కలాలు, లక్ష గళాలు ఎలుగెత్తి కీర్తించాయిని గుర్తు చేశారు.
చివరికి సాయుధ పోరాటాన్ని అణిచివేసిన సైన్యాధికారులు సైతం రైతాంగ యోధుల శౌర్యాన్ని త్యాగనిరతిని తమ రహస్య నివేదికల్లో కొనియాడితే.. ఆ పత్రాలను ఇటీవల వెలికితీసి అమెరికాలోని ఫెయిర్ ఫీల్డ్ యూనివర్సిటీ ‘ఫ్రం రాజ్ టు రిపబ్లిక్’ పేరుతో పుస్తకం ముద్రించిందన్నారు. ఇంత అసమాన పోరాట పటిమకు నాంది పలికిన దొడ్డి కొమురయ్య 78వ వర్థంతి ఏర్పాటు చేసిన జగద్గిరిగుట్ట కురుమ సంఘం సభ్యులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట కురుమ సంఘం అధ్యక్షులు కౌడే నర్సింలు, సెక్రటరీ దేవరి మల్లేష్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.