ఆదాయపన్నుపై అవగాహన

తెలంగాణ ప్రభ (కోరుట్ల): తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటీజేన్లకు,పెన్షనర్లకు,వివిధ వర్గాల వారికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు చేసేందుకు అవగాహన కల్పించారు. జగిత్యాల పట్టణంలో గురువారం రోజున అసోసియేషన్ కార్యాలయంలో టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఐటి రిటర్ను లు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణం కోసం లేదా వీసా కోసం దరఖాస్తు సమయంలోనూ పన్ను రిటర్నులు  ఉపయోగ పడుతాయన్నారు.

బ్యాంకులు,తదితర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాల కోసం పన్ను రిటర్ను రుజువు సమర్పించాల్సి ఉంటుందన్నారు.ఐటి రిటర్నులు గుర్తింపు రుజువుగాఉపయోగ పడుతాయన్నారు.వ్యాపారుల కోసం,ప్రభుత్వ టెండర్ల కోసం  బిడ్డింగ్ చేయాలన్నా ఐటిఆర్ ఫైల్ చేయడం కీలకమన్నారు.

ఫైల్ తో సమగ్ర ఆదాయ వివరాలు మీ దగ్గర ఉంటాయని,ఇది ఒక రకంగా ఆర్థిక నిర్ణయాలు తీసు కోవడంలో అవసరమన్నారు. ఆదాయం,మూలధన లాభాలు, తడితరాలపైన  నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.

కొన్ని సందర్భాల్లో మనం అదనపు పన్నులు చెల్లించినప్పుడు ,వాటిని తిరిగి పొందాలనంటే ఐటి ఆర్ లు ఫైల్ చేయాలన్నారు.సకాలంలో  ఐటి ఆర్ లు ఫైల్ చేయని వారికి జరిమానా పడుతుందని,కనుక ఐటి ఆర్ ఫైల్ చేసి ప్రయోజనాలు పొందాలని      హరి అశోక్ కుమార్   సూచించారు.

ఈ కార్యక్రమంలో  టీ పెన్షనర్స్ అసోసియేషన్  జిల్లా  సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్ ఉపాధ్యక్షుడు ప్రకాష్ రావు,సంయుక్త కార్యదర్శి దిండిగాల విట్ఠల్, ఎం.డి.యాకూబ్,సత్యనారాయణ,పబ్బా శివానందం,వివిధ సంఘాల  మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

.