తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): వైకల్యంతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగుడికి వీల్ చైర్ అందించడం పట్ల సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణానికి చెందిన పాసికంటి సతీష్ కుమార్ శరీరం చచ్చిబడిపోయి పడుతున్న ఇబ్బందులను జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజా దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎఫ్ ఆర్ వో సంతోష్ కుమార్ ద్వారా బాధితునికి వీల్ చైర్ అందించారని తెలిపారు. సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుసుమ గణేష్, జిల్లా దివ్యాంగుల సంఘం కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
