తెలంగాణ ప్రభ (కోరుట్ల):గల్ఫ్ దేశం ఖతర్ లో ఘనంగా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు ఆశయాల సాధన కోసం అధికారం లేకున్నా పదవితో కానీ సంబంధం లేకుండా ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ,ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ, కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా గత బిఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం,అసమర్ధత వల్ల ఎన్నో అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తీవ్ర స్థాయిలో పోరాటం చేసి పనులు త్వరితగతిన పూర్తి అయ్యి ప్రజలకు వినియోగంలోకి వచ్చే విధంగా కృషి చేసిన వ్యక్తి జువ్వాడి నర్సింగరావు అని,
అన్ని వర్గాల ప్రజల సేవలో తనదైన శైలిలో ముందుకెళ్తున్న కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా గల్ఫ్ దేశం ఖతర్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి వీరాభీమాని కోరుట్ల మండలం వెంకటాపూర్ ముహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముహమ్మద్ నసీర్ మిత్ర బృందం పాల్గొన్నారు.
.