తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల )విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపులను తొలగించి నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్టియు నాయకులు సోమిశెట్టి దశరథం డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికారులకు బెల్ట్ షాప్ లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం విక్రయాలను నియంత్రించి బెల్ట్ షాప్ నిర్వాహకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఏఐఎఫ్టీయు నాయకులు సలేంద్ర ఎల్లయ్య, బొద్దుల శ్రీహరి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
