పాల్గొన్న కార్పొరేటర్లు కె జగన్, మంత్రి సత్యనారాయణ
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) ను పురస్కరించుకొని జగద్గిరిగుట్ట ధన్వంతరి అనుభవ వైద్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం జగద్గిరిగుట్టలోని కార్యాలయంలో డాక్టర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగద్గిరిగుట్ట, సూరారం డివిజన్ల కార్పొరేటర్లు కొలుకుల జగన్ మంత్రి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు కార్పొరేటర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కార్పొరేటర్ జగన్ మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. వైద్యులను దేవునితో సమానంగా చూడడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యంగా ప్రజలకు ఎల్లవేళలా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న ఆర్.ఎం.పి ,పి.ఎం.పి డాక్టర్ల కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు విష్ణువర్ధన్,రవికుమార్,రాము,శోభన్ బాబు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
