సఫాయి అప్నావో బిమారీ భగావో కరపత్రాల విడుదల

తెలంగాణ ప్రభ (కోరుట్ల): స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో భాగంగా ఈరోజు కోరుట్ల మున్సిపల్ ఆఫీసు నందు మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆధ్వర్యంలో safai Apnao Bimaari Bhagao కార్యక్రమంలో భాగంగా IEC మెటీరియల్ మరియు పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. 

ఇది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. దీనిలో భాగంగా పాఠశాలలు, మరియు అంగన్వాడి సెంటర్ల యందు పరిశుభ్రతపై దృష్టి సాధించడమే కాకుండా పట్టణ ప్రజలు తీసుకుంటున్న నీటి నాణ్యత పై కూడా శ్రద్ధను వహించాల్సిన అవసరం ఉంటుంది. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి జూనియర్ అకౌంటెంట్ శివకుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్,హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

.