అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు టీపిఓ సంజన
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ గండి మైసమ్మ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట మాదాసు రామచంద్ర కాలనీలో సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారి సంజన కుల్చివేతలు చేపట్టారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంజన హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మల్లంపేటలో వివిధ కాలనీలలో పెద్ద పెద్ద అంతస్తులు నిర్మిస్తున్నారని అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేయాలని స్థానికులను కోరారు. మా దృష్టికి వస్తే వెంటనే కూల్చివేస్తామన్నారు. అక్రమ నిర్మాణదారులు ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కూల్చివేతలలో చైన్ మెన్ సతీష్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
