ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి వార్షికోత్సవం

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్   మండల పరిధిలోని  హంగర్గ  గ్రామంలో  లక్ష్మీ నరసింహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి గ్రామ మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యులు  గ్రామ పెద్దలు మాట్లాడుతూ... దాతల సహకారంతో గ్రామంలో ప్రతి సంవత్సరం ఆలయంలోని ప్రత్యేక పూజలు చేస్తూ ఆలయ వార్షికోత్సవాలను నిర్వహిస్తుంటామని అన్నారు. ఆలయం వద్ద  మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ సునీత విజయ్ పటేల్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

.