తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో మృతుని కుటుంబానికి తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక చేయూతను అందించారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన జల్లా సాయిలు అనే వ్యక్తి ఫిట్స్ తో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తెల్ల రవికుమార్ యువసేన సభ్యులు మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో తెల్ల రవికుమార్ యువసేన నిర్వాహకులు తెల్ల రవికుమార్, సభ్యులు కప్ప సంతోష్ వినోద్ పటేల్ పప్పుల యోగేష్ దామరంచ సంతోష్ కుల పెద్దలు కాలనీవాసులు హన్మాండ్లు కిష్టయ్య రాజు ఆనంద్ బ్రహ్మం శ్రీనివాస్ గౌడ్ రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు
