తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ... ఈ సమావేశం చివరి సమావేశం కావడంతో ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు మనల్ని ఎంపీటీసీగా గెలిపించి సేవ చేయమని అవకాశం కల్పించారని ఆమె అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పరిపాలనను సాపిగా సాగించవచ్చు. అని కొనియాడారు. ప్రజలకు మంచి చేయాలని చిత్తశుద్ధి ఉంటే చాలు పదవి అవసరం లేదని సభలో తెలిపారు. ఆమె అధికారులకు చివరి సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సమావేశం సమావేశానికి సకాలంలో వచ్చి అధికారులు తమకు అన్ని విధాల సహాయ సహకార అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు వచ్చినా వారికి ఇలాంటి సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని అధికారులతో ఆమె అన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఎంపిటిసి లందరికీ ఆమె పూలమాలవేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఏంపిపి గంగాధర్ పటేల్ ఎంపిటిసి కొట్టం మనోహర్, ఫారూఖ్, అనంత విట్టల్, ఉమా రాంబాబు, సరితా మారుతి సుజాత వెంకటరెడ్డి అధికారులు.. ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎంపీఓ మారుతి, ఏపీవో గంగారం, ఏపీఎం బసవంతరావు, డాక్టర్ సుప్రియ మండల విస్తీర్ణ అధికారి గోవర్ధన్ సూపర్వైజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
.