తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరిలో సోమవారం వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను ఏర్పాటు చేశారు. కోటగిరి గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యులను ఘనంగా సన్మానించారు. కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ సుప్రియ, హెల్త్ సూపర్వైజర్ జ్యోతిలను పూలమాలు శాలువాలతో సత్కరించారు. వైద్యులు దేవుళ్ళతో సమానమని వైద్య వృత్తి పవిత్రమైన వృత్తి అని లైన్స్ క్లబ్ సభ్యులు కొనియాడారు. వైద్య వృత్తిలోకి రావడం వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని వైద్యుల వల్ల వైద్య సిబ్బంది వల్ల ఎందరో రోగుల ప్రాణాలు కాపాడబడుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల కృషి మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, మాజీ అధ్యక్షులు తెల్ల రవికుమార్, సభ్యులు శివ చరణ్ పటేల్, మహ్మద్ అలీ, వడ్ల ఉమాకాంత్, రుద్రంగి సందీప్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.
