సాధు జంతువును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

తెలంగాణ ప్రభ, (రాజన్న సిరిసిల్ల): ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని శివాలయం వద్ద సాదు జంతువు చేతిబావిలో పడిపోయినది. శివాలయం వద్ద గల మోహన మూర్తి ఇట్టి విషయం  ఫైర్ సిబ్బందికి తెలియ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి బావిలో దిగి సాదు జంతువును కాపాడడం జరిగింది.

సాధు జంతువు పిల్లిని కాపాడినందుకు కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు

ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అగ్నిమాపక అధికారి ఎన్ నరేందర్ పి మహిపాల్( లీడింగ్ ఫైర్ మాన్) సబీర్( ఫైర్ మాన్) ఎల్ నవీన్ కుమార్( డ్రైవర్ ఆపరేటర్) హోంగార్డ్ హఫీజ్ పాల్గొన్నారు

.