తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని రచ్చగల్లలోని ముదిరాజ్ సంఘ కళ్యాణ మండపంలో రాజు పంతులు చేత ముదురాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హోమము, యజ్ఞము, కల్యాణోత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
