మల్లంపేట్ లోని సిసీ రోడ్డును ప్రారంభించిన కౌన్సిలర్లు శంబిపూర్ కృష్ణ, మాదాసు వెంకటేష్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్)  దుందిగల్  మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్ 23వ వార్డులోని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సహకారంతో ఇటీవల నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును స్థానిక కౌన్సిలర్ మాదాస్ వెంకటేష్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ  అనంతరం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. అనంతరం కాలనీ సభ్యులు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బాల క్రిష్ణ, నాయకులు నరసింహ, ఫాసి ఉద్దీన్, రాజు గౌడ్, ఉస్మాన్, విఠల్, మహేష్, సందీప్, శ్రీనివాస్, రాజేష్,  రమేష్, మల్లేష్, శ్రీశైలం, రవి,  మాదాస్ ఆదిత్య, మారుతి, భారత్, అతీఫ్, శ్రవణ్, మాన్విత్, మధు, మరియు స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

.