బిఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దుoనగర్ లో ఏర్పాటు చేసిన రోడ్డు సూచిక బోర్డులను ఆదివారం డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ యువజన నాయకులు కొలుకుల జైహింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూచిక బోర్డుల ను ఏర్పాటు చేయడం వలన ప్రతి ఒక్కరికి అడ్రస్ తెలుసుకోవడం సులభతరం అవుతుందన్నారు. ముఖ్యంగా అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల కే కాకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ తదితర సర్వీసులకు సైతం చిరునామా వెతకడం చాలా సులభంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మగ్దుoనగర్ కమిటీ అధ్యక్షులు, నిడిగొండ లక్ష్మణ్,మాజీ వార్డ్ మెంబర్,మహమూద్,శంకర్,రాయి రాజేష్,వినోద్ కుమార్, సత్య రాజు, సత్తిరెడ్డి,శ్రీనివాస్,ప్రభు,భాస్కర్ ,జైపాల్ రెడ్డి,శ్రీనివాస్ ,సునీల్ రెడ్డి, ఆంజనేయులు,వినోద్, మైలారం రాజ, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
