తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన ఈరోజు కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగినది.
ఇట్టి సమావేశంలో 34 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపినారు.
ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో అన్ని వార్డులలో రోడ్లపై గల గుంతలను మొరంతో నింపుటకు రూ" 5.00 లక్షలు, నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయుటకు రూ" 5.00 లక్షలు, శానిటేషన్ నిర్వహణ కొరకు రూ" 10.00 లక్షలు, పట్టణంలోని 33 వార్డులలో మురుగు కాలువల పైన స్లాబ్ కల్వర్టులు నిర్మించుటకు రూ" 15.00 లక్షలు కేటాయించినారు.
ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా డ్రైనేజీలు బాగు చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని చైర్ పర్సన్ ను కోరినారు. అందుకు బదులుగా చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యుల కోరిక మేరకు పట్టణ ప్రజలకు ప్రస్తుత వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొనుటకు అధికారులకు ముందుగానే ఆదేశాలు జారీ చేయడం జరిగినదని తెలిపారు
ఇట్టి సమావేశంలో చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమిది పవన్, మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి, AE J.లక్ష్మి, TPO A. ప్రవీణ్, TPS రమ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వార్డ్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ - మెంబెర్స్ , విద్యుత్ శాఖ అధికారులు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.