తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో జవాన్ గా పని చేసె గంగరాజం అనే కార్మికుని పదవీ విరమణ కార్యక్రమాన్ని శనివారం రోజు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా కమీషనర్ బట్టు తిరుపతి జవాన్ గంగరాజం చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం పూల మాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా కమీషనర్ తిరుపతి కారులో సొంత డ్రైవింగ్ లో జవాన్ గంగరాజంను ఎక్కించుకొని తన ఇంటికి మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళి ఔదార్యాన్ని చాటాడు. ఇలా చేయడo పట్ల పలువురు కమీషనర్ తిరుపతి ని అభినందించారు.
.