లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్..

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మెట్ పల్లి పట్టణంలోని SRSP ఫంక్షన్ హాల్ లో 16వ వార్షికోత్సవ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.

నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఇల్లెందుల శ్రీనివాస్, కార్యదర్శిగా  ఎన్నికైనటువంటి రాకేష్, కోశాధికారిగా ఎన్నికైనటువంటి నాంపల్లి వేణుగోపాల్ గార్లకు శుభాకాంక్షలు తెలియచేశారు. 

ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్న సేవలు అమోఘమని మునుముందు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ కి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.

.