నలుగురికి మంచి చేయాలనే సంకల్పం.. కల్పతరువు ఫౌండేషన్--
తెలంగాణ ప్రభ (కోటగిరి): నిజమాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని ఎక్లాస్ పూర్, రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో , కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సిరి సముందర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో హైదరాబాద్ కు చెందిన కల్పతరువు ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ భానుశిరీష శేషు కుమార్ దంపతులు సుమారు 60 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులతో పాటు 22 మందికి పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతిరోజు ఒకరికి సహాయం చేయాలనీ (హెల్ప్ వన్ పర్సన్ ఎవరీ డే), వాళ్ళకు జీవితంలో ఉపయోగపడేటువంటి విషయాలను ,తల్లిదండ్రులకు ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశ్యంతో వంటశాలలో ఉపయోగించే కూరగాయల వేస్టేజ్ తో వచ్చే (బయోఎంజ్రిమ్)తయారీ విధానం వివరించారు.
పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్. భాను శిరీషతో పాటు ఆమె స్నేహితులైన జూనియర్ లెక్చరర్ పొమ్మెడి లక్ష్మణ్ , ఏకం యోగ వెల్నెస్ ఫౌండర్ ప్రదీప్ కుమార్,యోగ ట్రైనర్ సాయి లను శాల్వలతో ఘనంగా సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్,ఉపాధ్యాయులు రాజు , సిరి సముద్రం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విమల, రాంపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విజయ్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
.