తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల పరిధిలోని జల్లాపల్లి ఫారంలో మాజీ మండల కోప్షన్ మెంబర్ స్వగ్రామంలో ఆయన సొంత డబ్బులతో మంచినీటి కొరత ఉండడంతో గ్రామంలోని బోరు వేయడం జరిగిందన్నారు.ఆయన మాట్లాడుతూ... నేను పుట్టిన గ్రామమైన జల్లాపల్లి ఫారంలో గ్రామ ప్రజల కొరకు నీటి దహనం తీర్చుటకు బోరు వేస్తున్నానని గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామానికి నీటి కొరత ఉండటంతో ఆయన సొంత డబ్బులతో బోరు వేసినందుకు మా గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నమన్నారు. ఆయన వెంట గ్రామ యువకులు దేవిసింగ్, మైనార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
