తెలంగాణ ప్రభ (కోరుట్ల): మాజీ ప్రధాని ఆర్థిక రంగ సంస్కరణలకు ఆధ్యుడు బహుభాషా కోవిదుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ భారతరత్న స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు 101వ జయంతిని కోరుట్ల నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావుల ఆదేశాల మేరకు కోరుట్ల మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతమ్ రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ లు పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పలువురు దేశానికి కాంగ్రెస్ పార్టీకి పీవీ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, ఎంబేరి నాగభూషణం, మ్యాకల నర్సయ్య, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్త, దండవేని వెంకట్, మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, చిలువేరి విజయ్, గడేల అశోక్, తెడ్డు విజయ్, సమీర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.