తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నేషనల్ డివార్మింగ్ డే కార్యక్రమంలో భాగంగా జాతీయ నూలి పురుగుల నిర్ములన కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కోటగిరి మండలంలోని ఉన్న కళాశాలలో ,గ్రామాలలో పాఠశాలలో, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రైవేట్ పాఠశాలలో పీల్లాలందరికి ఆల్బండాజోలు మాత్రలు విద్యార్థులకు, చిన్న పిల్లలకు పంపిణీ చేయటం జరిగిందని మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ తెలిపారు.మాప్ అప్ డే రోజున 1498 మంది పిల్లలకు పంపిణీ చేశామన్నారు .ఈ మాత్రలను వెయ్యడం ద్వారా పిల్లలో జ్ఞాపక శక్తి మెరుగు పరచటానికి, చురుకుధనం పెపొందించటానికి, రక్తహీనత నివారించటానికి, పోషణ లోపనివారణకు ఉపయోగపడుతయన్నారు. 13140 గాను నేటి వరకు 11392 మంది విద్యార్థులకు చిన్న పిల్లలకు మాత్రలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రంలో, ఆశ కార్యకర్తల వద్ద మాత్రలు లభించును అని తెలిపారు. మండల,గ్రామ పిల్లల తల్లిదండ్రులు ,ప్రజలు ఈ అవకాశం వినియోగించు కోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి కోరారు. మీ పిల్లలలో ఆరోగ్య సమస్యలు నివారణకు ఈ మాత్రలు చాలా ఉపయోగ పడునని తెలియ జేశారు.ఈ మాత్రల వలన విద్యార్థుల కు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమార్ స్టాఫ్ నర్స్ రాణి, సూపర్వైజర్ జ్యోతి,ఆరోగ్య సిబ్బంది రోజా శ్రీదేవి ప్రమీల ఆశ వర్కర్లు అనిత సంగీత అక్తరి, కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయునియుల బృందం తదితరులు పాల్గొన్నారు.....
