మాజీ స్పీకర్ ను కలిసిన దళిత సంఘాల నాయకులు

తెలంగాణ ప్రభ (కోటగిరి): నిజామాబాద్ జిల్లా   బాన్సువాడ నియోజకవర్గ కోటగిరి మండల దళిత సంఘాల నాయకులు  బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన అతిధి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నాయకులందరూ శుభాకాంక్షలు తెలిపారు.వారు   మాట్లాడుతూ.. కోటగిరి ఉమ్మడి మండలాల పలు గ్రామాల  దళితుల అభివృద్ధికి కృషి చేయాలని ఆయనకు కోరారు. గ్రామాలలోని సంఘాల భవనాలకు ప్రత్యేక నిధులు కేటాయించి భవన నిర్మాణాలను చేపట్టాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బ్యాగరి రాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు గైక్వాడ్ రాము, కన్నం సాయిలు, హస్గుల విజయ్, పేగ్గు లాలయ్య, తదితరులు ఉన్నారు.

.