కోరుట్ల మున్సిపల్ పరిధిలో ఎఫ్ టి ఎల్,బఫర్ జోన్ లలో అక్రమ కట్టడాలను తొలగించిన మున్సిపల్ అధికారులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎఫ్ టి ఎల్ (FTL) మరియు బఫర్ జొన్ లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై తగు చర్యలు తీసుకునవలసినదిగా జిల్లా కలెక్టర్, ఆదేశాలు జారీ చేసినారు. అట్టి ఆదేశాల మేరకు మద్దుల  చెరువు లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినారు. 

ఈ రోజు ఇరిగేషన్ శాఖ  సిబ్బంది, రెవెన్యూ శాఖ  సిబ్బంది, పోలీస్ శాఖ  సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా కలిసి అట్టి ఎఫ్ టి ఎల్ (FTL) లో నిర్మించిన అక్రమ కట్టడాలను JCB సహాయంతో పూర్తిగా తొలగించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ  సిబ్బంది, రెవెన్యూ శాఖ  సిబ్బంది, పోలీస్ శాఖ  సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

.