కోరుట్లలోని తాళ్లచెరువు, కంచరకుంట ప్రాంతాలలో ఎఫ్ టి ఎల్(FTL)లను గుర్తించారు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్, జగిత్యాల ఆదేశాలు జారి చేసినారు. అట్టి ఆదేశాల  మేరకు మున్సిపల్ సిబ్బంది మరియు నీటిపారుదల శాఖ సిబ్బందిచే సంయుక్తంగా పట్టణంలోని మద్దుల చెరువు, తాళ్లచెరువు మరియు కంచరకుంటలను పరిశీలించి ఎఫ్ టి ఎల్ (FTL) మరియు బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను గుర్తించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి, Dy.E.E  M. అభినయ్ కుమార్,  TPO A. ప్రవీణ్ కుమార్, TPS రమ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ D. గజనంద్, నీటిపారుదల శాఖ Dy.E.E M.M. తిరుమల్ కుమార్, A.E.E B. వెంకటేష్ గార్లు పాల్గొన్నారు.

.