తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా "ఏక్ పెడ్ మా కా నామ్" (అమ్మ పేరిట ఒక మొక్కను ) నాటాలని ఉద్దేశంతో బిజెపి నాయకులకు, కార్యకర్తలకు మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ... ఈ నెల 5 వ తేదిన ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరిట ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని బుద్ధ జయంతి పార్కు లో ఒక రావి మొక్క ను నాటారనీ తెలిపారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా "ఏక్ పెడ్ మా కా నామ్" అమ్మ పేరిట ఒక మొక్కను నాటే కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఒక మొక్క నాటాలని పార్టీ సూచించిందన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ రాజా గౌడ్, మండల అధ్యక్షుడు ప్రకాష్ పటేల్, లింగం నరేష్, రాజశేఖర్ రెడ్డి, బజరంగ్, వెంకట్ గౌడ్, ఓబిసి మోర్ఛ అధికార ప్రతినిధి మక్కయ్య, అశోక్, జగదీష్,భారత్ సాయి, నయిమోద్దీన్, బిజెపి బిజెవైఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
