పారిశుద్ధ కార్మికునికి రోడ్డు ప్రమాదం... కార్మికుని ఢీకొట్టిన ఉబర్ క్యాబ్

రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు.. పోలీసుల అదుపులో  క్యాబ్ డ్రైవర్ 

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మితిమీర వేగంతో అజాగ్రత్తగా కారు నడిపి రోడ్డు పక్కన విధులు నిర్వహిస్తున్న పరిశుద్ధ కార్మికుని ఢీ కొట్టి తీవ్రంగా గాయపరిచిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. గాజులరామారావు సర్కిల్ పారిశుద్ధ విభాగంలో కార్మికుడిగా శాంతారావు పనిచేస్తున్నాడు ఇందులో భాగంగా రోజువారిగానే గణేష్ నగర్ రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం షోరూమ్ ఎదురుగా చెత్త సేకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐడిపిఎల్ నుంచి చింతల్ వైపు క్యాబ్ టీఎస్ 07 యుఏ0507లో అజాగ్రత్తగా వేగంగా నడుపుతూ కార్ డ్రైవర్ నాగాంజనేయ పారిశుద్ధ కార్మికుడు శాంతారావును బలంగా ఢీకొట్టాడు. దీంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన కార్మికుడు శాంతారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను జీడిమెట్ల పోలీసులు తీసుకున్నారు. కార్మికుడు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలు కాగా ప్రస్తుతం ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని సమాచారం.

.