తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి గ్రామంలో 168, 169 సర్వే నంబర్ లలో 10 ఎకరాల భూమిలో రైల్వే లైన్ కోసం రెవిన్యూ అధికారులు 4 ఎకరాల భూమిని సేకరించి చెక్కులు పంపిణీ చేశారు. కానీ 168 సర్వే నంబర్ లో ఉన్న 3 బావులు, 1 బోర్వెల్ చెక్కులు రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదని వాటి కోసం ఎమ్మార్వో , ఆర్డిఓ ఆఫీస్ ల చుట్టూ 6 నెలలుగా తిరుగుతున్నామని ఎమ్మార్వో ని కలిస్తే ఆర్డిఓ ని ఆర్డిఓ ని కలిస్తే ఎమ్మార్వో అని కలవమంటున్నారని రైతులు తెలిపారు. గురువారం రోజున రైల్వే అధికారులు మా భూమిలో పనులు మొదలు పెట్టారని బావులు, బోర్వెల్ డబ్బులు ఇవ్వకుండా పనులు ఎలా మొదలు పెడతారని రైతులు ప్రశ్నిస్తే రైల్వే అధికారులు నానా బూతులు తిడుతూ మీపై పోలీసు కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే తమ పనులు కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.
