పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ : కొలను హనుమంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్  ఉషోదయ టవర్స్  చెందిన సత్యనారాయణ కొడుకు సుదీప్  గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్  హాస్పిటల్ లో  చికిత్స పొందుతున్నాడు. చికిత్స చేసుకోవడానికి కూడా ఆర్థికంగా లేకపోవడంతో కుత్బుల్లాపూర్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా  వెంటనే స్పందించి హనుమంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడి  శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,50,000/- రూ  సీఎం సహాయనిధి - ఎల్వోసీ ని మంజూరు చేయించారు. రూ.2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు ) సిఎంఆర్ఎఫ్- ఎల్ ఓ సి  ఇప్పించారు. బాచుపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతరం ఎల్ఓసి  పత్రాలను సత్యనారాయణ  కుటుంబ సభ్యులకు కుత్బుల్లాపూర్  ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ లక్ష్మ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ, మాజీ కౌన్సిలర్  రషీద్, సిద్దయ్య, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, గాదె వినోద్, ఎండీ రజాక్, అమెర్, దినేష్, సంపంగి వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు .

.