తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎక్లాస్పూర్ క్యాంప్ లో గుమ్మడి బాయ్స్ ఆశ్రమంను జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి సందర్శించారు. ఆశ్రమంలోని పిల్లల సమస్యలను, పరిసరాలను గదులను పరిశీలిస్తూ, ఆశ్రమ సిబ్బందితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువు పట్ల వారి జ్ఞానాన్ని, క్రమశిక్షణను అడిగి తెలుసుకున్నారు. ఆమె పిల్లలతో మాట్లాడుతూ శ్రద్ధగా పాఠశాలకు వెళుతూ ఉన్నతమైన విద్యను చదివి జీవితంలో స్థిరపడుతూ,గుమ్మడి ఫౌండేషన్ పేరు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఆమె వెంట గుమ్మడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుమ్మడి శ్రీధర్ సుచిత్ర ,గుమ్మడి ఫౌండేషన్ మేనేజర్ నీరడి మధు డి.ఎల్. ఎస్.ఏ. సిబ్బంది తదితరులు ఉన్నారు.
