సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండాలి. మండల విస్తరణ అధికారి గోవర్ధన్

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్ వారి సిబ్బందితో కలిసి ఆకస్మాత్తుగా   సందర్శించారు. పాఠశాలలలోని పరిసరాలను పరిశుభ్రతను, పాఠశాల బిల్డింగ్ పైన ఉన్న నీటి నిల్వలను,  త్రాగునీరు ట్యాంకులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయునిలతో  మాట్లాడుతూ...  వర్షాకాలం ఉన్నందున ఈగలు దోమలు ద్వారా వచ్చే వ్యాధుల పట్ల విద్యార్థినిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వారానికి ఒకసారి ట్యాంకులను శుభ్రపరచాలన్నారు.  సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ, దోమల ద్వారా  వ్యాప్తి చెందే   విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలని సూచించారు. అన్నం తినే ముందు చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆతిసార వ్యాధి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి, ఆరోగ్య సిబ్బంది రోజా శ్రీదేవి, ఆశ వర్కర్ల అనిత, సంగీత, అక్తరి, కేజీబీవీ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.