తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కన్వీనర్ గా కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన జోగు వెంకట్ నియామకం అయ్యారు. బుధవారం కంటోన్మెంట్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎండబ్ల్యూజేఎఫ్ జాతీయ ఇంచార్జీ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ సుంచు అశోక్ మాదిగ ఎండబ్ల్యూజేయు రాష్ట్ర ఇన్ ఛార్జ్ సుంచు అశోక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలై 7న వరంగల్ లో జరిగే ""మాదిగల కవాతు ""ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జోగు వెంకట్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వామ్యంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని, తన నియామకానికి సహకరించిన సంఘం జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఎర్ర యాకన్న, సి దశరథ్ మహంకాళి బిక్షపతి, బూడిద నరేందర్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
