తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ జూనియర్ కళాశాలలో కోరుట్ల ఎస్ఐ కిరణ్ కుమార్ విద్యార్థులకు గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహిస్తూ, డ్రగ్స్ వాడడం వల్ల వ్యక్తి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది, కావున ప్రతి వ్యక్తి గంజాయి వాడకుండా మరియు అరికట్టడానికి అవసరమైన చర్యలను తెలియజేస్తూ, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్ హరిప్రియ అంజయ్య గౌడ్ కళాశాల ప్రిన్సిపల్ సకినాల రాజు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది.
.