ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి

తెలంగాణ ప్రభ (కోరుట్ల):జగిత్యాల జిల్లా కోవెల పట్టణంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (జూన్ 23) - జయంతి (జూలై 6) సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో భాగంగా

"ఏక్ పెడ్ మా కే నామ్" (తల్లి పేరుతో ఒక మొక్క) కార్యక్రమం పురస్కరించుకొని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని B E D కాలేజ్ దగ్గర రోడ్డు ప్రక్కన మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని రక్షించడానికి తమవంతుగా ఒక మొక్క నాటాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యవర్గ సభ్యులు సుదవేని మహేష్ కౌన్సిలర్లు మడవేని నరేష్, పెండం గణేష్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్లపెల్లి సాగర్, ఇట్యాల నవీన్ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్,గుద్దేటి రాజేందర్,ఒళ్ళోజి నగేష్, చేట్పల్లి ఓం ప్రకాష్, చంద్ పాషా, దుర్గా ప్రసాద్, శ్యామ్, తోట నరేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

.